Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

పెబ్బేరు వేదికగా తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికలు

Author
Posted By CK NEWS
| 06 Oct 2026, 10:08 AM | TELANGANA
పెబ్బేరు వేదికగా తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికలు

ముఖ్యమైన పాయింట్స్:

  • *పెబ్బేరు వేదికగా తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికలు*
  • *షాద్‌నగర్ నియోజకవర్గం నుంచి వివిధ పార్టీల నాయకుల చేరిక*

తెలంగాణ రాజ్యాధికార పార్టీ షాద్‌నగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి మీదికేరి రాధాకృష్ణ, షాద్‌నగర్ అధ్యక్షులు సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో షాద్‌నగర్ నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నాయకులు పెబ్బేరు వేదికగా తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు.

పార్టీలో చేరిన ఉప్పర మోనీ రాములు ముదిరాజ్, బీఎస్పీ గుండ్ల శ్రీనివాస్ ముదిరాజ్, గుల్ల హరిప్రసాద్, గడీల అంజయ్య తదితరులకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు, బీసీ సంఘాల ప్రతినిధులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు మల్లన్న గారి చేపట్టిన బీసీ రాజ్యాధికార ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు. బీసీల రాజకీయ హక్కులు, రాజ్యాధికారమే లక్ష్యంగా సాగుతున్న పాదయాత్రకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

అనంతరం స్థానిక ప్రెస్ క్లబ్ ప్రతినిధులు తమ సమస్యలను తీన్మార్ మల్లన్న గారి దృష్టికి తీసుకెళ్లారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి