పెబ్బేరు వేదికగా తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికలు
- *పెబ్బేరు వేదికగా తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికలు*
- *షాద్‌నగర్ నియోజకవర్గం నుంచి వివిధ పార్టీల నాయకుల చేరిక*
తెలంగాణ రాజ్యాధికార పార్టీ షాద్‌నగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి మీదికేరి రాధాకృష్ణ, షాద్‌నగర్ అధ్యక్షులు సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో షాద్‌నగర్ నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నాయకులు పెబ్బేరు వేదికగా తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు.
పార్టీలో చేరిన ఉప్పర మోనీ రాములు ముదిరాజ్, బీఎస్పీ గుండ్ల శ్రీనివాస్ ముదిరాజ్, గుల్ల హరిప్రసాద్, గడీల అంజయ్య తదితరులకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు, బీసీ సంఘాల ప్రతినిధులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు మల్లన్న గారి చేపట్టిన బీసీ రాజ్యాధికార ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు. బీసీల రాజకీయ హక్కులు, రాజ్యాధికారమే లక్ష్యంగా సాగుతున్న పాదయాత్రకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు.
అనంతరం స్థానిక ప్రెస్ క్లబ్ ప్రతినిధులు తమ సమస్యలను తీన్మార్ మల్లన్న గారి దృష్టికి తీసుకెళ్లారు.