Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

భారత్ మహిళా కబడ్డీ జట్టుకు స్వర్ణం

Author
Posted By CK NEWS
| 26 Sep 2026, 11:52 AM | Sports
భారత్ మహిళా కబడ్డీ జట్టుకు స్వర్ణం

ముఖ్యమైన పాయింట్స్:

  • భారత్ మహిళా కబడ్డీ జట్టుకు స్వర్ణం

*సి కె న్యూస్ క్రీడా ప్రతినిధి*


హైదరాబాద్:సెప్టెంబర్ 26
ఆసియా కప్ 2026 క్రీడల్లో భాగంగా.. భారత మహిళల కబడ్డీ జట్టు అద్భుతం చేసింది. సెప్టెంబర్ 26న ఉదయం జరిగిన ఫైనల్‌లో ఇరాన్‌పై 37-34 తేడాతో విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.

హాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో సాధించిన టైటిల్‌ను నిలబెట్టు కుని మరోసారి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ విజయంతో భారత్ ఖాతాలో మూడో స్వర్ణ పతకం చేరింది. భారత్, ఇరాన్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ హోరాహోరీగా సాగింది.

ఇవి కూడా చదవండి

ఇరాన్ జట్టు చివరి వరకు గట్టి పోటీ ఇచ్చింది. చివరి నిమిషంలో పాయింట్ల కోసం ఇరాన్ తీవ్రంగా ప్రయత్నించగా.. భారత రక్షణ విభాగం కీలక సమయంలో అద్భుత ప్రదర్శన చేసింది. అయనాజ్‌పై చేసిన కీలక ట్యాకిల్‌తో భారత్ విజయాన్ని ఖరారు చేసుకుంది. టోర్నీ మొత్తం అద్భుతంగా రాణించిన సంజు దేవి.. ఫైనల్‌లోనూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది.

*భారత్ ఖాతాలో 27 పతకాలు*

మహిళల కబడ్డీలో స్వర్ణంతో భారత్ మొత్తం పతకాల సంఖ్య 27కు చేరింది. ఇందులో 3 స్వర్ణాలు, 11 రజతాలు, 13 కాంస్య పతకాలు ఉన్నాయి. పతకాల పట్టికలో భారత్ 12వ స్థానంలో నిలిచింది. భారత మహిళల కబడ్డీ జట్టులో పూజ, రాజ్ రాణి, సోనాలి విష్ణు షింగాటే, పుష్ప, భావన దేవి, రీతూ, సంజు దేవి, రీతూ నేగి, మనీషా కుమారి, పింకీ రాయ్, జ్యోతి, నికితా సభ్యులుగా ఉన్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి