Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

ఆసియా క్రీడల డబుల్ గోల్డ్ మెడలిస్ట్ చికితకు ఘన స్వాగతం

Author
Posted By CK NEWS
| 06 Oct 2026, 04:05 PM | Sports
ఆసియా క్రీడల డబుల్ గోల్డ్ మెడలిస్ట్ చికితకు ఘన స్వాగతం

ముఖ్యమైన పాయింట్స్:

  • ఆసియా క్రీడల డబుల్ గోల్డ్ మెడలిస్ట్ చికితకు ఘన స్వాగతం
  • శంషాబాద్ విమానాశ్రయంలో స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఘన సన్మానం

జపాన్‌లో జరిగిన ఆసియా క్రీడలు–2026లో ఆర్చరీలో రెండు స్వర్ణ పతకాలు సాధించిన తెలంగాణ క్రీడా ఆణిముత్యం తానిపర్తి చికిత హైదరాబాద్‌కు చేరుకున్న సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ స్వాగత కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, స్పోర్ట్స్ అథారిటీ అధికారులు అశోక్ కుమార్, శ్రీనివాస్, కన్నం మధు, సురేష్ కాలేరు, తెలంగాణ ఒలింపిక్ సంఘం కార్యదర్శి మల్లారెడ్డి, ఆర్చరీ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు టి. రాజు, అరవింద్ తదితరులు పాల్గొని చికితకు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా చికితతో పాటు ఆమె తల్లిదండ్రులను ఘనంగా సన్మానించారు. అంతర్జాతీయ వేదికపై తెలంగాణకు రెండు స్వర్ణ పతకాలు అందించిన చికిత విజయాన్ని అధికారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు ప్రశంసించారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి