Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

ప్రజలకు ఉచిత న్యాయ సేవలపై అవగాహన కల్పించాలి!

Author
Posted By Shaik Said baji
| 11 Nov 2026, 05:35 PM | వార్తలు
ప్రజలకు ఉచిత న్యాయ సేవలపై అవగాహన కల్పించాలి!

ముఖ్యమైన పాయింట్స్:

  • ఖమ్మంలో న్యాయ అవగాహన ర్యాలీకి శ్రీకారం చుట్టిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎం. నాగరాజు
  • ర్యాలీని ప్రారంభించిన జిల్లా చైర్మన్
  • అర్హులందరికీ ఉచిత న్యాయ సహాయం

ఖమ్మం: ఆర్థిక స్థోమత లేక ఏ ఒక్కరూ న్యాయానికి దూరం కాకూడదనే లక్ష్యంతో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉచిత న్యాయ సహాయం అందించేందుకు న్యాయ సేవాధికార సంస్థ కృషి చేస్తోందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పి. దేవి మానస తెలిపారు.
ర్యాలీని ప్రారంభించిన జిల్లా చైర్మన్
న్యాయ సేవల దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఖమ్మంలో న్యాయ అవగాహన ర్యాలీ, న్యాయ సేవల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎం. నాగరాజు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.న్యాయ సేవలపై ప్రత్యేక ప్రదర్శన
అనంతరం న్యాయ సేవా సదన్ భవనంలో ఏర్పాటు చేసిన న్యాయ సేవల ప్రదర్శనను ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో జాతీయ న్యాయ సేవాధికార సంస్థ (NALSA) అమలు చేస్తున్న వివిధ పథకాలు, ఉచిత న్యాయ సహాయం పొందే విధానాలు, న్యాయ సేవలకు సంబంధించిన సమాచార పుస్తకాలు, కరపత్రాలను ప్రజల అవగాహన కోసం ఏర్పాటు చేశారు.
అర్హులందరికీ ఉచిత న్యాయ సహాయం
ఈ సందర్భంగా కార్యదర్శి పి. దేవి మానస మాట్లాడుతూ.. ఆర్థిక, సామాజిక పరిస్థితులతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉచిత న్యాయ సహాయం అందించడమే సంస్థ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రజలు న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న సేవలను తెలుసుకుని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.పలువురు న్యాయ ప్రముఖుల హాజరు
ఈ కార్యక్రమంలో ఖమ్మం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వై. రమేష్, న్యాయాధికారులు, న్యాయవాదులు, ప్యానల్ న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లు, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి