Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

టేకులపల్లి మండలం లో తెలంగాణ ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య

Author
Posted By G KALYAN KUMAR
| 08 Nov 2026, 11:45 AM | TELANGANA
టేకులపల్లి మండలం లో తెలంగాణ ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య

నవంబర్.8.భద్రాది కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య హాజరై,పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు ఆనందోత్సాహాల మధ్య వేడుకల్లో పాల్గొని ముఖ్యమంత్రి గారి ఆయురారోగ్యాలతో,సుఖసంతోషాలతో ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్ మండల అధ్యక్షులు లక్కినేని శ్యామ్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈది గణేష్, రెడ్యానాయక్,మధురెడ్డి,సరిత,సంజయ్,సర్దార్,నాగేశ్వరావు, రవి,వెంకన్న,హరి,కోరం హనుమంతు,సైదులు, నర్సయ్య,నగేష్,ఈశ్వర్, తదితర నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి