టేకులపల్లి మండలం లో తెలంగాణ ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య
నవంబర్.8.భద్రాది కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య హాజరై,పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు ఆనందోత్సాహాల మధ్య వేడుకల్లో పాల్గొని ముఖ్యమంత్రి గారి ఆయురారోగ్యాలతో,సుఖసంతోషాలతో ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్ మండల అధ్యక్షులు లక్కినేని శ్యామ్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు...