Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

సత్యం, ధర్మం, నైతిక విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలి

Author
Posted By Bhargav raju manne
| 26 Oct 2026, 03:52 PM | TELANGANA, TELUGU NRI
సత్యం, ధర్మం, నైతిక విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలి

ముఖ్యమైన పాయింట్స్:

  • జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు
  • కలెక్టరేట్‌లో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు.
  • ములుగు జిల్లా సి కె న్యూస్ ప్రతినిధి భార్గవ్

మహర్షి వాల్మీకి ఆశయాలను ఆదర్శంగా తీసుకొని సత్యం, ధర్మం, నైతిక విలువలను ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఆచరించాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు. మహర్షి వాల్మీకి జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మీనాతో కలిసి మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మహర్షి వాల్మీకి బోధనలు, ఆశయాలు సమాజానికి స్ఫూర్తిదాయకమని, ఆయన చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.

సమాజంలో సత్యం, ధర్మం, నైతిక విలువలకు ప్రాధాన్యతనిస్తూ ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. మహర్షి వాల్మీకి ఆశయాలను ఆచరణలో పెట్టడం ద్వారా సమాజంలో మంచి మార్పులకు దోహదపడాలని పిలుపునిచ్చారు.

మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలను స్మరించుకుంటూ, ఆయన బోధించిన విలువలను భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి