Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

చల్లాసముద్రం అభివృద్ధికి బుచ్చక్క సేవలు మరువలేనివి

Author
Posted By సి కె న్యూస్ ప్రతినిధి, (సురేష్)
| 14 Oct 2026, 04:53 PM | Array
చల్లాసముద్రం అభివృద్ధికి బుచ్చక్క సేవలు మరువలేనివి

ముఖ్యమైన పాయింట్స్:

  • చల్లాసముద్రం అభివృద్ధికి బుచ్చక్క సేవలు మరువలేనివి
  • న్యూడెమోక్రసీ సీనియర్ నాయకురాలు కొట్టెం బుచ్చక్కకు ఎర్రజెండా కప్పి ఘన నివాళులు
  • భద్రాది కొత్తగూడెం జిల్లా,
  • సి కె న్యూస్ ప్రతినిధి,

( ఎంఎల్ ) న్యూడెమోక్రసీ సీనియర్ నాయకురాలు కామ్రేడ్ కొట్టెం బుచ్చక్క అనారోగ్యంతో బుధవారం సాయంత్రం మృతి చెందారు. ఆమె మృతి పార్టీకి, పేద ప్రజల ఉద్యమాలకు తీరని లోటని న్యూడెమోక్రసీ నాయకులు అన్నారు. బుధవారం ఆమె పార్ధివ దేహంపై ఎర్రజెండా కప్పి నాయకులు ఘనంగా నివాళులర్పించారు.

ప్రజా సేవలో ముందుండి..
ఈ సందర్భంగా కామ్రేడ్ నరాటి వెంకన్న అధ్యక్షతన జరిగిన సంతాప సభలో న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు కామ్రేడ్ తుపాకుల నాగేశ్వరరావు, మండల కార్యదర్శి యాదలపల్లి సత్యం, ఖమ్మం జిల్లా నాయకులు కామ్రేడ్ ప్రకాష్ అన్న మాట్లాడుతూ.. కొట్టెం బుచ్చక్క పేద ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడిన ధీరవనిత అని కొనియాడారు. ఉమ్మడి చల్లాసముద్రం పంచాయతీ అభివృద్ధికి ఆమె చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు.

మహిళా హక్కుల కోసం పోరాటం..
చేనకలగడ్డ ఆశ్రమ హాస్టల్ ఏర్పాటు కోసం పోరాడి సాధించడంలో బుచ్చక్క కీలక పాత్ర పోషించారని తెలిపారు. మహిళల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేశారని, న్యూడెమోక్రసీ పార్టీ తరఫున రెండుసార్లు ఎంపీటీసీగా ఎన్నికై ప్రజలకు నిస్వార్థంగా, నిజాయితీతో సేవలందించారని గుర్తుచేసుకున్నారు. ఆమె మృతి పట్ల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఇవి కూడా చదవండి

పలువురి నివాళులు..
ఈ కార్యక్రమంలో ప్రగతిశీల యువజన సంఘం (పీవైఎల్) రాష్ట్ర నాయకులు మోతిలాల్, అనిల్ రెడ్డి, దొంతు లక్ష్మయ్య, కాంపాటి కోటేశ్వరరావు, కోయల శ్రీను, మాజీ సర్పంచ్ వేప వెంకన్న తదితరులు పాల్గొని కామ్రేడ్ బుచ్చక్కకు నివాళులర్పించారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి