Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

TG SAFE డ్రగ్స్ విభాగం డైరెక్టర్‌గా శ్రీ జి. రాంధన్ నియామకం

Author
Posted By CK NEWS
| 28 Sep 2026, 07:25 PM | TELANGANA
TG SAFE డ్రగ్స్ విభాగం డైరెక్టర్‌గా శ్రీ జి. రాంధన్ నియామకం

ముఖ్యమైన పాయింట్స్:

  • TG SAFE డ్రగ్స్ విభాగం డైరెక్టర్‌గా శ్రీ జి. రాంధన్ నియామకం
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,
  • సీకే న్యూస్ ప్రతినిధి,

ఇల్లందు సెప్టెంబర్ 28 : తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ సేఫ్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (TG SAFE) డ్రగ్స్ విభాగం నూతన డైరెక్టర్‌గా శ్రీ జి. రాంధన్ గారు నియమితులయ్యారు. ఇప్పటివరకు ఇదే విభాగంలో జాయింట్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించిన ఆయన, పదోన్నతిపై డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు.
రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ తర్వాత డ్రగ్స్ విభాగం డైరెక్టర్ పదవి అందుబాటులో లేకుండా పోగా, ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఈ పదవిని పునఃసృష్టించింది. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత TG SAFE డ్రగ్స్ విభాగం తొలి డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఘనతను శ్రీ జి. రాంధన్ గారు దక్కించుకున్నారు. ఆయన బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పలువురు అధికారులు, సిబ్బంది, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మెడికల్ అసోసియేషన్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి