Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

సిద్ధాపూర్ డంపింగ్ యార్డు సమస్యపై అధికారులతో సమావేశం

Author
Posted By CK NEWS
| 28 Sep 2026, 01:17 PM | TELANGANA
సిద్ధాపూర్ డంపింగ్ యార్డు సమస్యపై అధికారులతో సమావేశం

ముఖ్యమైన పాయింట్స్:

  • సురేష్ నాయక్ ఇస్లావత్
  • రాష్ట్ర అధికార ప్రతినిధి
  • బంజారా సేవాదళ్

సిద్ధాపూర్ డంపింగ్ యార్డు సమస్యపై జాతీయ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్ (NCST) సభ్యులు హుస్సేన్ నాయక్ గారి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు, స్థానిక పరిస్థితులు మరియు సంబంధిత అంశాలపై చర్చించేందుకు ఈరోజు కొత్తూరు MRO ముంతాజ్ బేగంని బంజారా సేవాదళ్ నాయకులు కలిసి వినతిపూర్వకంగా సమాచారం అందించారు.

హుస్సేన్ నాయక్ సిద్ధాపూర్ పర్యటన సందర్భంగా స్థానిక రైతులు, తండాల ప్రజలు మరియు బాధిత కుటుంబాలతో మాట్లాడే విధంగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని, సమస్యకు సంబంధించిన వివరాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. సిద్ధాపూర్‌లో ప్రతిపాదిత వ్యర్థాల నిర్వహణ సదుపాయానికి సంబంధించి G.O.Rt.No.641 ఇప్పటికే జారీ కాగా, స్థానిక రైతులు మరియు గ్రామాల ప్రజలు భూమి, నీరు, వ్యవసాయం, పర్యావరణం తదితర అంశాలపై ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో బంజారా సేవాదళ్ రైతు విభాగం అధ్యక్షులు అమ్గోత్ తారాసింగ్ నాయక్, రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణ్ నాయక్, రంగారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పాప్యా నాయక్, మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

ప్రజల సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, బాధిత రైతులు మరియు తండాల ప్రజలకు న్యాయం జరిగేలా ప్రజాస్వామ్య పద్ధతిలో మా ప్రయత్నం కొనసాగుతుందన్నారు

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి