Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

బ్యాంకు ఖాతాదారులకు బిగ్ రిలీఫ్.. దేశవ్యాప్త సమ్మె వాయిదా!

Author
Posted By CK NEWS
| 28 Sep 2026, 12:14 AM | NATIONAL
బ్యాంకు ఖాతాదారులకు బిగ్ రిలీఫ్.. దేశవ్యాప్త సమ్మె వాయిదా!

ముఖ్యమైన పాయింట్స్:

  • బ్యాంకు ఖాతాదారులకు బిగ్ రిలీఫ్.. దేశవ్యాప్త సమ్మె వాయిదా!

సోమవారం (సెప్టెంబర్ 28) నుండి మూడు రోజుల పాటు జరగాల్సిన దేశవ్యాప్త బ్యాంకుల సమ్మె తాత్కాలికంగా వాయిదా పడింది. ఆదివారం రాత్రి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA), యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ప్రతినిధుల మధ్య జరిగిన కీలక చర్చలు సఫలం కావడంతో ఉద్యోగ సంఘాలు సమ్మెను విరమించుకుంటున్నట్లు ప్రకటించాయి. వారానికి 5 రోజుల పనిదినాల డిమాండ్‌పై చర్చించేందుకు ఇరు వర్గాలతో ఒక హైలెవల్ కమిటీని ఏర్పాటు చేసేందుకు అంగీకారం కుదిరింది. సమ్మె వాయిదా పడటంతో సోమవారం నుండి దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయని, బ్యాంకింగ్ సేవలు కస్టమర్లకు సాధారణంలాగే అందుబాటులో ఉంటాయని యూనియన్ ప్రతినిధులు స్పష్టం చేశారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి