బ్యాంకు ఖాతాదారులకు బిగ్ రిలీఫ్.. దేశవ్యాప్త సమ్మె వాయిదా!

ముఖ్యమైన పాయింట్స్:బ్యాంకు ఖాతాదారులకు బిగ్ రిలీఫ్.. దేశవ్యాప్త సమ్మె వాయిదా! సోమవారం (సెప్టెంబర్ 28) నుండి మూడు రోజుల పాటు జరగాల్సిన దేశవ్యాప్త బ్యాంకుల సమ్మె తాత్కాలికంగా వాయిదా పడింది. ఆదివారం రాత్రి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA), యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ప్రతినిధుల మధ్య జరిగిన కీలక చర్చలు సఫలం కావడంతో ఉద్యోగ సంఘాలు సమ్మెను విరమించుకుంటున్నట్లు ప్రకటించాయి. వారానికి 5 రోజుల పనిదినాల డిమాండ్‌పై చర్చించేందుకు ఇరు వర్గాలతో ఒక హైలెవల్ కమిటీని ఏర్పాటు చేసేందుకు అంగీకారం కుదిరింది. సమ్మె వాయిదా పడటంతో సోమవారం నుండి దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయని, బ్యాంకింగ్ సేవలు...