Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

సదాశివునిపాలెం HP పెట్రోల్ బంకులో నిర్లక్ష్యం బట్టబయలు!

Author
Posted By Shaik Said baji
| 09 Nov 2026, 02:44 PM | వార్తలు
సదాశివునిపాలెం HP పెట్రోల్ బంకులో నిర్లక్ష్యం బట్టబయలు!

ముఖ్యమైన పాయింట్స్:

  • మణికంఠ సాయి ఫిల్లింగ్ స్టేషన్‌లో కనీస సదుపాయాలు కరువు!
  • పెట్రోల్ అమ్మకాలే ముఖ్యం.. వాహనదారుల సమస్యలు పట్టవా? HP అధికారుల పర్యవేక్షణ ఏది?

సత్తుపల్లి మండలం సదాశివునిపాలెం గ్రామం: పెట్రోల్ బంకు నిర్వహణ అంటే పెట్రోల్, డీజిల్ విక్రయించి డబ్బులు సంపాదించడమేనా? వినియోగదారులకు కనీస సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత లేదా? సదాశివునిపాలెం గ్రామంలోని **మనికంట సాయి ఫిల్లింగ్ స్టేషన్ (HP పెట్రోల్ బంక్)**లో నెలకొన్న పరిస్థితులు యాజమాన్య పనితీరుపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
కృష్ణారావు యాజమాన్యంలో కొనసాగుతున్న ఈ పెట్రోల్ బంకులో వాహనదారులకు కనీస గాలి సదుపాయం కూడా అందుబాటులో లేకపోవడంతో గాలి నింపించుకోవడానికి వస్తున్న వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు బంకుకు వచ్చినా గాలి సదుపాయం అందక నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
వినియోగదారుల నుంచి డబ్బులు తీసుకునే విషయంలో ముందుంటూ.. వారికి అవసరమైన కనీస సదుపాయాలు కల్పించడంలో వెనుకబడటం ఎంతవరకు సమంజసం? పెట్రోల్ బంకులో సౌకర్యాలు ఉన్నాయో లేదో పర్యవేక్షించాల్సిన HP ఆయిల్ కంపెనీ అధికారులు ఏం చేస్తున్నారు? బంకు నిర్వహణపై తనిఖీలు చేస్తున్నారా? లేక యాజమాన్యం నిర్లక్ష్యాన్ని చూసీచూడనట్లు వదిలేస్తున్నారా?పెట్రోల్ బంకులకు వచ్చే వాహనదారుల సౌకర్యాలను విస్మరించడం సరికాదు. ఇప్పటికైనా HP కంపెనీ ఉన్నతాధికారులు స్పందించి మనికంట సాయి ఫిల్లింగ్ స్టేషన్‌లో క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించాలి. లోపాలు ఉన్నట్లయితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకొని అవసరమైన సదుపాయాలు కల్పించాలి.
ప్రజలకు సేవలు అందించాల్సిన HP పెట్రోల్ బంకులోనే కనీస సౌకర్యాలు కరువైతే ఇక ఎవరిని ప్రశ్నించాలి? పెట్రోల్ అమ్మకాలకే పరిమితమవుతారా? లేక వినియోగదారుల సమస్యలను కూడా పట్టించుకుంటారా? HP ఉన్నతాధికారులు, బంకు యాజమాన్యం ఇప్పటికైనా సమాధానం చెప్పాలి!

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి