Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

మైనారిటీ నిరుద్యోగ యువతకు ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ

Author
Posted By Chand Pasha
| 08 Nov 2026, 08:38 AM | వనపర్తి
మైనారిటీ నిరుద్యోగ యువతకు ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ

ముఖ్యమైన పాయింట్స్:

  • గ్రూప్స్, పోలీస్ ఉద్యోగాల పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు అవకాశం

సీకే న్యూస్ ప్రతినిధి వనపర్తి జిల్లా:
తెలంగాణ రాష్ట్ర మైనారిటీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో మైనారిటీ నిరుద్యోగ యువతకు టీజీపీఎస్సీ గ్రూప్స్‌-1, 2, 3, 4తో పాటు టీజీపీఆర్‌బీ పోలీస్ కానిస్టేబుల్, ఎస్‌ఐ ఉద్యోగాల పోటీ పరీక్షలకు ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ చేయనున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి ఎం.డి. సిరాజుద్దీన్ తెలిపారు.
ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, జైన్, బౌద్ధ మైనారిటీ వర్గాలకు చెందిన అర్హులైన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఆసక్తి గల అభ్యర్థులు 2026 నవంబర్ 12వ తేదీన వనపర్తి ఐడీఓసీ కార్యాలయంలోని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయం, రూమ్ నంబర్ 111/1, మొదటి అంతస్తులో అవసరమైన ధ్రువపత్రాలతో సంప్రదించాలని కోరారు.
కావలసిన ధ్రువపత్రాలు:
మైనారిటీ కమ్యూనిటీ సర్టిఫికెట్.
విద్యార్హత ధ్రువపత్రం.
పోటీ పరీక్షల దరఖాస్తు లేదా రిజిస్ట్రేషన్ కాపీ.
ఆధార్ కార్డు జిరాక్స్.
రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు.
మరిన్ని వివరాలకు 08545-232500, 7207854914 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.
గమనిక: దరఖాస్తు ఫారం జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి కార్యాలయంలో పొందవచ్చు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి