Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

వనపర్తి జిల్లాలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనుల పరిశీలన

Author
Posted By Chand Pasha
| 06 Nov 2026, 03:42 PM | వనపర్తి
వనపర్తి జిల్లాలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనుల పరిశీలన

ముఖ్యమైన పాయింట్స్:

  • మార్చి 2027 నాటికి పనులు పూర్తి చేయాలి: రాష్ట్ర ఉద్యానశాఖ సంచాలకులు షేక్ యాస్మిన్ బాషా

జిల్లాలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులకు మరింత ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లి గ్రామ శివారులో నిర్మిస్తున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనులను రాష్ట్ర ఉద్యానశాఖ సంచాలకులు షేక్ యాస్మిన్ బాషా, ఐఏఎస్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఫ్యాక్టరీ నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించి, శ్రీ యూనిక్ ఆయిల్ పామ్ కంపెనీ ప్రతినిధుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.
ఫ్యాక్టరీ నిర్మాణ పనులను వేగవంతం చేసి, మార్చి 2027 నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు. జిల్లాలో ఇప్పటికే 6,700 ఎకరాలకు పైగా ఆయిల్ పామ్ సాగు జరుగుతున్న నేపథ్యంలో ఫ్యాక్టరీ అందుబాటులోకి వస్తే రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.
రైతులు తమ తోటల్లో పండించిన ఆయిల్ పామ్ గెలలను (FFB) స్థానికంగానే విక్రయించుకునే అవకాశం కలుగుతుందని, రవాణా ఖర్చులు, ఇబ్బందులు తగ్గుతాయని పేర్కొన్నారు.
అనంతరం ఆయిల్ పామ్ రైతులతో ముఖాముఖి మాట్లాడి ఎకరాకు వస్తున్న దిగుబడి, పంట ద్వారా లభిస్తున్న ఆదాయం, సాగులో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని మరింత పెంచేందుకు రైతులకు అవసరమైన సాంకేతిక సలహాలు, సహాయ సహకారాలు అందించాలని అధికారులకు సూచించారు.
స్థానికంగా ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయితే జిల్లాలో రైతులకు మార్కెటింగ్ సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు సాగుకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానశాఖ అధికారి విజయభాస్కర్, ఆయిల్ పామ్ సీఈఓ సత్యనారాయణ, ఆయిల్ పామ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కె. బుచ్చన్న, ఉపాధ్యక్షుడు హరీష్ రెడ్డి, శ్రీ యూనిక్ కంపెనీ ప్రతినిధులు, ఉద్యానశాఖ అధికారులు, ఉద్యాన విస్తరణ అధికారులు, ఆయిల్ పామ్ క్లస్టర్ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి