Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

కుక్కల బెడద నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలి: అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్

Author
Posted By Chand Pasha
| 04 Nov 2026, 06:18 AM | వనపర్తి
కుక్కల బెడద నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలి: అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్

ముఖ్యమైన పాయింట్స్:

  • జాగ్రత్తలు తీసుకోవాలి.. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అమలు చేయాలి

సీకే న్యూస్ ప్రతినిధి వనపర్తి జిల్లా:
జిల్లాలో వీధి కుక్కల బెడదను తగ్గించడంతో పాటు కుక్కకాటు ఘటనలను నివారించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఖీమ్యా నాయక్ ఆదేశించారు.
మంగళవారం అదనపు కలెక్టర్ ఛాంబర్‌లో వీధి కుక్కల నిర్వహణ, కుక్కకాటు నివారణపై సుప్రీంకోర్టు మార్గదర్శకాల అమలుకు సంబంధించి మున్సిపల్ కమిషనర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుక్కకాటు బాధితులకు తక్షణ వైద్యం అందించేలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో యాంటీ రేబిస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంచాలని సూచించారు. కుక్కలు అధికంగా సంచరించే ప్రాంతాలను గుర్తించి, డాగ్ క్యాచర్ల ద్వారా వాటిని పట్టుకొని నిబంధనల ప్రకారం చికిత్స, వ్యాక్సినేషన్ అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ముఖ్యంగా పాఠశాలల పరిసరాల్లో వీధి కుక్కల సంచారాన్ని అరికట్టి విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కుక్కలు పాఠశాలల ఆవరణలోకి రాకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
వీధి కుక్కల నిర్వహణలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని, ప్రజలకు కుక్కకాటు ప్రమాదాలు, నివారణ చర్యలపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో జెడ్పీ సీఈవో యాదయ్య, పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటయ్య గౌడ్, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా పంచాయతీ అధికారి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి