Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

తెలంగాణలో ఫుట్‌బాల్ టాలెంట్ హంట్

Author
Posted By CK NEWS
| 10 Oct 2026, 06:05 PM | Sports, TELANGANA
తెలంగాణలో  ఫుట్‌బాల్ టాలెంట్ హంట్

ముఖ్యమైన పాయింట్స్:

  • తెలంగాణలో ఫుట్‌బాల్ టాలెంట్ హంట్
  • ఖేలో తెలంగాణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ఫుట్‌బాల్ క్రీడా సంస్కృతిని పునరుద్ధరించే లక్ష్యంతో నిర్వహణ

హైదరాబాద్ : తెలంగాణలో ఫుట్‌బాల్ క్రీడను ప్రోత్సహించడంతో పాటు, యువ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ , ఇండియా ఖేలో ఫుట్‌బాల్ (IKF) సహకారంతో తెలంగాణ ఫుట్‌బాల్ ప్రతిభాన్వేషణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఖేలో తెలంగాణ కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 11 నుంచి నవంబర్ 6, 2026 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఏడు ప్రాంతాల్లో ఈ ప్రతిభాన్వేషణ ట్రయల్స్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతిభావంతులైన బాలబాలికలను గుర్తించి, వారికి క్రమబద్ధమైన ఫుట్‌బాల్ శిక్షణ, అభివృద్ధికి సంబంధించిన అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. తెలంగాణలో ఫుట్‌బాల్ క్రీడా సంస్కృతిని పునరుద్ధరించే దిశగా ఈ కార్యక్రమం కీలక ముందడుగుగా నిలవనుంది. జిల్లాల్లోనే ట్రయల్స్ నిర్వహించడం ద్వారా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన బాలబాలికలకు తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం లభిస్తుంది. తద్వారా భవిష్యత్తులో రాష్ట్రం నుంచి మరింత మంది ప్రతిభావంతులైన ఫుట్‌బాల్ క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు మార్గం సుగమం కానుంది.
క్రీడలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లి, యువతలోని క్రీడా ప్రతిభను వెలికితీయడం, క్రీడలను ప్రజలకు మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ఖేలో తెలంగాణ కార్యక్రమంలో భాగంగా ఈ ప్రతిభాన్వేషణ నిర్వహిస్తున్నారు.

అర్హతలు : ఈ ఫుట్‌బాల్ ప్రతిభాన్వేషణ కార్యక్రమంలో పాల్గొనేందుకు వయస్సు అర్హతలు:

బాలురు: 2009 నుంచి 2016 మధ్య జన్మించినవారు.
బాలికలు: 2001 నుంచి 2015 మధ్య జన్మించినవారు.
ప్రతి కేంద్రంలో నిర్ణీత తేదీన ఉదయం 8 గంటలకు ప్రతిభా అంచనా పరీక్షలు, శిక్షణ శిబిరాలు ప్రారంభమవుతాయి.

*ఫుట్‌బాల్ ఫుట్ బాల్ హంట్ షెడ్యూల్*

1. హకీంపేట్ – మేడ్చల్-మల్కాజిగిరి
టీజీఎస్ఎస్ హకీంపేట్
11.10.2026 (ఆదివారం)
2. మహబూబ్‌నగర్
డీఎస్ఏ స్టేడియం
14.10.2026 (బుధవారం)
3. సిద్దిపేట
మినీ స్టేడియం
16.10.2026 (శుక్రవారం)
4. నిజామాబాద్
కలెక్టర్ గ్రౌండ్
18.10.2026 (ఆదివారం)
5. మెదక్
ఇందిరా గాంధీ అవుట్‌డోర్ స్టేడియం
22.10.2026 (గురువారం)
6. హైదరాబాద్
గచ్చిబౌలి స్టేడియం
25.10.2026 (ఆదివారం)
7. సరూర్‌నగర్
సరూర్‌నగర్ స్టేడియం
06.11.2026 (శుక్రవారం)
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్
అర్హత కలిగిన క్రీడాకారులు కింది గూగుల్ ఫారం ద్వారా ఆన్‌లైన్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.
రిజిస్ట్రేషన్ లింక్:
https://forms.gle/NWgucogbJWGEpBCm8
నిర్ణీత తేదీల్లో ట్రయల్స్ నిర్వహించేందుకు సంబంధిత క్రీడా మైదానాలను అందుబాటులో ఉంచాలని జిల్లా యువజన, క్రీడల అధికారులు, స్టేడియం నిర్వాహకులకు తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ సూచించింది.ఈ కార్యక్రమంపై విస్తృత ప్రచారం నిర్వహించడంతో పాటు, అర్హులైన క్రీడాకారులు పాల్గొనేలా స్థానిక పాఠశాలలు, కళాశాలలు, ఫుట్‌బాల్ అకాడమీలు, క్లబ్‌లను సంప్రదించాలని కోరింది.రాష్ట్రంలోని అర్హులైన యువ ఫుట్‌బాల్ క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు, కోచ్‌లు, విద్యాసంస్థలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ విజ్ఞప్తి చేసింది.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి