దీపావళి వేడుకలు సురక్షితంగా జరుపుకోవాలి బాణసంచా కాల్చేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి
ముఖ్యమైన పాయింట్స్:మాజీ జెడ్పిటిసి కేసిరెడ్డి వెంకట్రావమ్మ చిన్నారెడ్డి సి కె న్యూస్ కొల్లాపూర్ ప్రతినిధి : చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి పండుగను చిన్నంబావి మండల ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య, సురక్షిత వాతావరణంలో దీపావళి పండుగ జరుపుకోవాలని చిన్నంబావి మండల మాజీ జడ్పిటిసి కేసిరెడ్డి వెంకట్రావమ్మ చిన్నారెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సందర్భంగా చిన్నంబావి మండలంలోని ప్రజలకు, కుటుంబ సభ్యులకు హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి పండుగ సందర్భంగా పిల్లలు, యువకులు బాణసంచా కాల్చేటప్పుడు ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని సూచించారు. ముఖ్యంగా చిన్నపిల్లలు టపాసులు కాల్చే సమయంలో తల్లిదండ్రులు తప్పనిసరిగా పర్యవేక్షించాలని కోరారు. బాణసంచా...