వనపర్తి జిల్లాలో లోటు వర్షపాతం

ముఖ్యమైన పాయింట్స్:15 మండలాల్లో సాధారణం కంటే తక్కువ వర్షాలు.. జిల్లాలో 39 శాతం లోటు సీకే న్యూస్ వనపర్తి వనపర్తి జిల్లాలో ఈ ఏడాది జూన్ 1 నుంచి అక్టోబర్ 26 వరకు సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. జిల్లాలో సాధారణ వర్షపాతం 593.2 మిల్లీమీటర్లు కాగా, ఇప్పటివరకు 362 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. దీంతో జిల్లాలో 39 శాతం లోటు వర్షపాతం ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జిల్లాలోని 15 మండలాల్లో అత్యధికంగా రేవల్లి మండలంలో 500.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వనపర్తి మండలంలో 418.1 మి.మీ., పెద్దమందడి మండలంలో 402.5 మి.మీ., పెబ్బేరు మండలంలో 410.1 మి.మీ. వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా...