షాద్‌నగర్‌లో వైద్య నిర్లక్ష్యంపై కలకలం!

ముఖ్యమైన పాయింట్స్:*షాద్‌నగర్‌లో వైద్య నిర్లక్ష్యంపై కలకలం!**దాదాజీ క్లినిక్‌లో చికిత్స వికటించిందంటూ జర్నలిస్ట్ ఆరోపణ**రూ.20 వేలు వసూలు చేసి.. పరిస్థితి విషమించడంతో పెద్దాసుపత్రికి వెళ్లాలని సూచించారంటూ బాధితుడి ఆవేదన**క్లినిక్‌పై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్*సి కే న్యూస్ షాద్ నగర్ :అక్టోబర్ 11 షాద్‌నగర్ పట్టణంలో వైద్య చికిత్సల నిర్వహణ, క్లినిక్‌లపై అధికారుల పర్యవేక్షణ అంశాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. నందిగామ మండలానికి చెందిన జర్నలిస్ట్ జాంగిలి సురేందర్‌కు షాద్‌నగర్‌లోని పరమేశ్వర థియేటర్ రోడ్డులో ఉన్న దాదాజీ క్లినిక్‌లో అందించిన చికిత్స వికటించిందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఈ ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని...