జిల్లా స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్
- క్రీడలతోనే సంపూర్ణ వికాసం
- గెలుపోటములను సమానంగా స్వీకరించాలి
- పాఠశాల యాజమాన్యానికి అభినందనలు
పెనుబల్లి: విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి, వారిలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడమే లక్ష్యంగా జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పేర్కొన్నారు.
పెనుబల్లి మండలం కుప్పెనకుంట్ల గ్రామంలోని MJPTBCWRS పాఠశాలలో నిర్వహించిన డిస్ట్రిక్ట్ లెవెల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026 ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్రీడా పోటీలను లాంఛనంగా ప్రారంభించారు.
క్రీడలతోనే సంపూర్ణ వికాసం
అనంతరం వివిధ క్రీడా పోటీల్లో పాల్గొంటున్న విద్యార్థులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. చదువుతో పాటు క్రీడలు కూడా విద్యార్థుల జీవితంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదల, నాయకత్వ లక్షణాలు అలవడతాయని వివరించారు.
గెలుపోటములను సమానంగా స్వీకరించాలి
క్రీడల్లో గెలుపు ఒక్కటే లక్ష్యం కాకుండా, క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొనడం ముఖ్యమని విద్యార్థులకు సూచించారు. ఓటమి ఎదురైనా నిరుత్సాహపడకుండా మరింత పట్టుదలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
పాఠశాల యాజమాన్యానికి అభినందనలు
కార్యక్రమానికి ఆహ్వానించి, జిల్లా స్థాయి క్రీడా పోటీల నిర్వహణకు చక్కటి ఏర్పాట్లు చేసిన పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం, సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గ, పెనుబల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కుప్పెనకుంట్ల గ్రామ నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, విద్యార్థులు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.