🏠 cknews.in
Watermark
Clip Header Logo
Date of Publish : 10 November 2026, 3:13 pm Posted by : Shaik Said baji

నూతన మార్కెట్ కమిటీ చైర్మన్‌కు ఘన సత్కారం!

News Image
  • చల్లగుళ్ల నరసింహారావుకు మాజీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు శుభాకాంక్షలు
  • పూలమాల, శాలువాతో నూతన చైర్మన్‌కు ఘన సన్మానం
  • రైతుల సంక్షేమానికి పెద్దపీట వేయాలని ఆకాంక్ష
  • కార్యక్రమంలో పాల్గొన్న ఐఎన్‌టీయూసీ వైస్ ప్రెసిడెంట్ కోటేశ్వరరావు, పలువురు నాయకులు

సత్తుపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్‌గా ఎన్నికైన చల్లగుళ్ల నరసింహారావుకు ఘన సన్మానం లభించింది. మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు నూతన చైర్మన్‌ను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా నూతన చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన నరసింహారావు రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, వారి సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ వైస్ ప్రెసిడెంట్ కోటేశ్వరరావు, పిల్లి మల్లికార్జున్, మట్టా చెన్నారావు, రమేష్, తన్నీరు శ్రీను, గుంజా వెంకటేశ్వరరావు, బల్లెం చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
🏠 Home