🏠 cknews.in
Watermark
Clip Header Logo
Date of Publish : 08 November 2026, 10:13 pm Posted by : G KALYAN KUMAR

కోయగూడెం గ్రామం నందు ఇందిరమ్మ ఇళ్లలో ఆనందోత్సాహాల మధ్య దీపావళి వేడుకలు

News Image
నవంబర్ 8.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం. కోయగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని పలు ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య పాల్గొని,ఇందిరమ్మ ఇళ్లలోని కుటుంబ సభ్యులతో కలిసి దీపాలు వెలిగించి దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య వారి సతీమణి శ్రీమతి లక్ష్మి ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం ఉమా సురేందర్ కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా మమేకమై పండుగ ఆనందాన్ని పంచుకున్నారు.ఈ కార్యక్రమంలో కోయగూడెం గ్రామ సర్పంచ్ శ్రీ కోరం సుభాష్ చంద్రబోస్ పాల్గొన్నారు.
ప్రతి ఇంటా వెలుగులు నిండాలి ప్రతి కుటుంబంలో ఆనందాలు వెల్లివిరియాలి పేద, మధ్యతరగతి కుటుంబాల జీవితాల్లో సంతోషాల వెలుగులు నింపాలనే ఆకాంక్షతో దీపావళి వేడుకలు ఆత్మీయ వాతావరణంలో జరిగాయి.
🏠 Home