ప్రతి ఇంట దీపాల కాంతులు- ప్రతి గుండెల్లో ఆనందాల దీపావళి శుభాకాంక్షలు
- బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కేతపాగ సుధాకర్
సి కె న్యూస్ కొల్లాపూర్ ప్రతినిధి : చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి పండుగను చిన్నంబావి మండల ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య, సురక్షిత వాతావరణంలో దీపావళి పండుగ జరుపుకోవాలని చీకట్లనో చీల్చి వెలుగుల వాకిట అడుగుపెట్టి ఆనందాల దీపావళి ఆగరంగా వైభవంగా జరుపుకోవాలి. చిన్నంబావి మండల బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కేతపాగ సుధాకర్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సందర్భంగా చిన్నంబావి మండలంలోని ప్రజలకు, కుటుంబ సభ్యులకు హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి పండుగ సందర్భంగా పిల్లలు, యువకులు బాణసంచా కాల్చేటప్పుడు ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని సూచించారు. ముఖ్యంగా చిన్నపిల్లలు టపాసులు కాల్చే సమయంలో తల్లిదండ్రులు తప్పనిసరిగా పర్యవేక్షించాలని కోరారు. బాణసంచా కాల్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు బాణసంచాను బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే కాల్చాలి. పిల్లలు పెద్దల పర్యవేక్షణలోనే టపాసులు కాల్చాలి. టపాసులు కాల్చేటప్పుడు చేతిలో పట్టుకోకూడదు. నీటి బకెట్, ఇసుక అందుబాటులో ఉంచుకోవాలి. మండుతున్న టపాసుల దగ్గరకు వెళ్లకూడదు. పేలని టపాసులను మళ్లీ వెలిగించే ప్రయత్నం చేయకూడదు. టపాసులు కాల్చేటప్పుడు కాటన్ దుస్తులు ధరించడం మంచిది. ఆసుపత్రులు, పెట్రోల్ బంకులు, జనసమ్మర్థ ప్రాంతాల సమీపంలో బాణసంచా కాల్చకూడదు. కళ్లకు, చేతులకు గాయాలైతే వెంటనే వైద్య సహాయం పొందాలి. ఆనందాల వెలుగులు ప్రతి ఇంటా నిండాలి. దీపావళి అంటే కేవలం దీపాలు, బాణసంచా మాత్రమే కాదని, ప్రతి ఇంటిలో సంతోషం, స్నేహభావం, ప్రేమానురాగాలు వెల్లివిరియాలని అన్నారు. పండుగ వేళ పేదలకు సహాయం చేస్తూ, ప్రతి ఒక్కరితో సంతోషాలను పంచుకోవాలని సూచించారు. చిన్నంబావి మండల ప్రజలందరూ ప్రమాదకర టపాసులు, బాణసంచాల ప్రమాదాలకు దూరంగా ఉంటూ, ఆరోగ్యంగా, ఆనందంగా, కుటుంబ సభ్యులతో కలిసి సురక్షిత దీపావళి జరుపుకోవాలని, పండుగ ఆనందం అందరిలో పంచుతూ పేద ధనిక తేడా లేకుండా ప్రతి ఇంట వెలుగులు నింపాలని ఈ దీపావళి ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త ఆశలు ఆశయాలు సంతోషాలను నింపాలని ఆకాంక్షిద్దాం అని మనస్ఫూర్తిగా కోరుకుంటు ఈ సందర్భంగా చిన్నంబావి మండల బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కేతపాగ సుధాకర్ చిన్నంబావి మండలం లోని వివిధ గ్రామాల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.