🏠 cknews.in
Watermark
Clip Header Logo
Date of Publish : 07 November 2026, 8:48 pm Posted by : Charakonda Babu

కొప్పునూరు గ్రామ, మరియు మండలం లోని ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు

News Image
  • బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తగరం ఆటో కురుమయ్య


సీకే న్యూస్ కొల్లాపూర్ ప్రతినిధి
చెడుపై మంచి సాధించిన విజయానికి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే దీపావళి పండుగను ప్రతి ఒక్కరూ ఆనందంతో, భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కొప్పునూరు గ్రామ తగరం ఆటో కురుమయ్య ఆకాంక్షించారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని కొప్పునూరు గ్రామ ప్రజలతో పాటు చిన్నంబావి మండలంలోని వివిధ గ్రామాల ప్రజలకు ఆయన హృదయపూర్వక హ్యాపీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి అంటే కేవలం దీపాలు వెలిగించి బాణసంచా కాల్చుకునే పండుగ మాత్రమే కాదని, ప్రతి ఒక్కరి జీవితాల్లో చీకట్లను తొలగించి వెలుగులు నింపే పండుగ అని పేర్కొన్నారు. చెడును విడనాడి మంచిని ఆచరించాలని, కుల మతాలకు అతీతంగా ఐకమత్యంతో జీవించాలని పండుగ మనకు సందేశాన్ని ఇస్తుందని తెలిపారు. ప్రతి ఇంటా దీపాల కాంతులు విరజిమ్మాలని, ప్రతి కుటుంబంలో సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. రైతులు, కూలీలు, యువత, మహిళలు, చిన్నారులు అందరూ ఆనందంగా దీపావళి వేడుకలు జరుపుకోవాలని కోరారు. అదేవిధంగా పండుగ సందర్భంగా చిన్నారులు, యువత బాణసంచా కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని, ప్రమాదాలకు దూరంగా ఉంటూ పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ దీపావళి ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త ఆశలు, సరికొత్త వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు మీ తగరం ఆటో కురుమయ్య కొప్పునూరు గ్రామం.
🏠 Home