తెలంగాణ రక్షణ సేన బంజారా వింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా న్యాయవాది రాంజీనాయక్
- తెలంగాణ రక్షణ సేన బంజారా వింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా న్యాయవాది రాంజీనాయక్
- సి కె న్యూస్ ప్రతినిది
హైదరాబాద్: తెలంగాణ రక్షణ సేన బంజారా వింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం బొప్పారం గ్రామానికి చెందిన ప్రముఖ న్యాయవాది వాంకుడొత్ రాంజీనాయక్ నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆయనకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాధ్యతలను అప్పగించారు.
ఈ సందర్భంగా రాంజీనాయక్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించిన పార్టీ ఆది నాయకురాలు కవితకు మరియు సహకరించిన నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ బంజారా వర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
బంజారా వర్గ అభ్యున్నతి, హక్కుల పరిరక్షణ, విద్యా, సామాజిక, రాజకీయ రంగాల్లో సముచిత అవకాశాల సాధన కోసం కృషి చేస్తానని తెలిపారు. తెలంగాణ రక్షణ సేన బలోపేతానికి కార్యకర్తలు, నాయకులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానని వెల్లడించారు.