🏠 cknews.in
Watermark
Clip Header Logo
Date of Publish : 28 October 2026, 4:04 pm Posted by : G KALYAN KUMAR

ప్రజల భద్రతే మా ప్రథమ ప్రాధాన్యత*

News Image


సి కె న్యూస్ ప్రతినిధి ఇల్లందు( జి కళ్యాణ్ )

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి తుఫాన్ ప్రభావం నేపథ్యంలో ఇల్లందు నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ శాఖ సూచనలను తప్పనిసరిగా పాటించాలని ఎమ్మెల్యే కోరం కనకయ్య విజ్ఞప్తి చేసారు.అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లవద్దు అని భారీ వర్షాలు, ఈదురుగాలుల సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండవధ్ధు అని విద్యుత్ తీగలు తెగిపడిన చోట్లకు దూరంగా ఉండాలని. రైతులు, కూలీలు, ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.ప్రభుత్వ అధికారులు,సంబంధిత శాఖలు అప్రమత్తంగా ఉండి ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కొరారు.ప్రజలందరూ జాగ్రత్తగా ఉండి మీ కుటుంబాల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేసారు.మీకు ఏ సమస్య ఎదురైనా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని పెర్కోన్నారు.మీ భద్రతే మా మా బాధ్యత ప్రజల కోసం నిరంతరం అందుబాటులో ఉంటామని తెలియచేసారు.
🏠 Home