🏠 cknews.in
Watermark
Clip Header Logo
Date of Publish : 26 October 2026, 1:08 pm Posted by : Chand Pasha

వనపర్తి జిల్లాలో లోటు వర్షపాతం

News Image
  • 15 మండలాల్లో సాధారణం కంటే తక్కువ వర్షాలు.. జిల్లాలో 39 శాతం లోటు

సీకే న్యూస్ వనపర్తి
వనపర్తి జిల్లాలో ఈ ఏడాది జూన్ 1 నుంచి అక్టోబర్ 26 వరకు సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. జిల్లాలో సాధారణ వర్షపాతం 593.2 మిల్లీమీటర్లు కాగా, ఇప్పటివరకు 362 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. దీంతో జిల్లాలో 39 శాతం లోటు వర్షపాతం ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
జిల్లాలోని 15 మండలాల్లో అత్యధికంగా రేవల్లి మండలంలో 500.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వనపర్తి మండలంలో 418.1 మి.మీ., పెద్దమందడి మండలంలో 402.5 మి.మీ., పెబ్బేరు మండలంలో 410.1 మి.మీ. వర్షపాతం నమోదైంది.
అత్యల్పంగా ఆత్మకూరు మండలంలో 258.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అమరచింతలో 264.3 మి.మీ., పంగల్‌లో 276.9 మి.మీ., చిన్నంబావిలో 306.3 మి.మీ. వర్షపాతం మాత్రమే నమోదైంది.
జిల్లాలోని ఆత్మకూరు మండలంలో 60 శాతం లోటు వర్షపాతం నమోదై, తీవ్ర లోటు వర్షపాతం ఉన్న మండలంగా నిలిచింది. మిగిలిన మండలాల్లోనూ సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిశాయి. రేవల్లి మండలంలో 11 శాతం లోటు ఉన్నప్పటికీ, వర్షపాతం సాధారణ స్థాయికి దగ్గరగా నమోదైంది.
వర్షపాతం తగ్గడంతో వ్యవసాయం, భూగర్భ జలాలు, తాగునీటి వనరులపై ప్రభావం పడే అవకాశముంది. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవడం, నీటి సంరక్షణ చర్యలకు ప్రాధాన్యత ఇవ్వడం అవసరం.
🏠 Home