ఖమ్మం జిల్లా తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ జిల్లా అధ్యక్షుడిగా షేక్ హుస్సేన్ నియామకం,....
- ఖమ్మం జిల్లా తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ జిల్లా అధ్యక్షుడిగా షేక్ హుస్సేన్ నియామకం,....
తెలంగాణ ఉద్యమకారుడు, యువ నాయకుడు షేక్ హుస్సేన్ ను ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా శ్రీమతి శ్రీ కల్వకుంట్ల కవిత గారు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు నియమించడం జరిగింది, ఖమ్మం జిల్లా ఉద్యమాల్లో కీలకంగా పనిచేసిన హుస్సేన్ మొదటి నుంచి కవిత గారి అనుచరుడుగా కొనసాగుతున్నారు ఖమ్మం జిల్లాలో కల్వకుంట్ల కవిత కు నమ్మకమైన వ్యక్తిగా ఉన్నారు హుస్సేన్ స్వస్థలం ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కుర్నవల్లి గ్రామం, జిల్లాలో తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పోరాటాలు ఎన్నో సభలు సమావేశాలు నిర్వహించి సరిహద్దు ప్రాంతమైన ఖమ్మం జిల్లాలో ఈ ప్రాంత ప్రజల్లో చైతన్యం నింపి తెలంగాణ ఉద్యమాన్ని కీలకంగా ముందుకు తీసుకెళ్లడంలో తన పాత్ర చాలా కీలకమని చెప్పుకోవచ్చు, తనను నమ్మి ఇంత పెద్ద బాధ్యతను తన మీద పెట్టినందుకు కల్వకుంట్ల కవిత గారికి తాను రుణపడి ఉంటానని, ఖమ్మం జిల్లా ప్రజల కష్టసుఖాల్లో తోడుంటానని ప్రజా సమస్యలపై పోరాడుతానని ప్రజలకు అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.